తెలంగాణ: హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 213 మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Dec 04, 2021, 09:58 PM IST
తెలంగాణ: హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 213 మందికి పాజిటివ్

సారాంశం

తెలంగాణ (Telangana)లో కొత్తగా 213 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 156 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,779 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (telangana) కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 39,495 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 213 కరోనా కేసులు (corona cases in telangana ) నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల నిన్న ఒకరు మరణించారు. దీంతో కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు (corona deaths in telangana)మరణించిన వారి సంఖ్య 3,998కి చేరింది. వైరస్ నుంచి నిన్న 156 మంది పూర్తిగా కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3,779 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. విదేశాల నుంచి ఇవాళ రాష్ట్రానికి వచ్చిన 70 మందికి పరీక్షలు నిర్వహించగా.. 70 మందికి నెగిటివ్‌ వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,76,787కి చేరుకుంది. అలాగే తెలంగాణ ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,69,010కి చేరింది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 1, జీహెచ్ఎంసీ 72, జగిత్యాల 5, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 13, ఖమ్మం 9, మహబూబ్‌నగర్ 1, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 1, మంచిర్యాల 4, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 1, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 5, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 1, పెద్దపల్లి 5, సిరిసిల్ల 0, రంగారెడ్డి 21, సిద్దిపేట 9, సంగారెడ్డి 20, సూర్యాపేట 10, వికారాబాద్ 2, వనపర్తి 1, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 9, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR