తెలంగాణలో కరోనా విలయతాండవం: కొత్తగా 213 కేసులు, 5,406కి చేరిన సంఖ్య

By Siva KodatiFirst Published Jun 16, 2020, 10:46 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా మంగళవారం కొత్తగా 213 మందికి పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా మంగళవారం కొత్తగా 213 మందికి పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,406కు చేరుకుంది.

తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,188 ఉండగా... వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 3,027 మంది. మంగళవారం ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 165 కేసులు నమోదవ్వగా, మెదక్‌లో 13, మేడ్చల్‌ 3, ఆసిఫాబాద్, కామారెడ్డి, జనగామ, భువనగిరిలలో ఒక్కొక్కటి సంగారెడ్డి 2, రంగారెడ్డి 16, నిజామాబాద్‌ 2 కేసులు నమోదయ్యాయి. ఇవాళ వైరస్ కారణంగా నలుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 191కి చేరుకుంది. 

హైద్రాబాద్ కోఠిలోని గోకుల్ చాట్ యజమానికి కరోనా సోకింది. దీంతో ఈ చాట్ దుకాణాన్ని అధికారులు మంగళవారం నాడు మూసివేశారు.ఈ చాట్ దుకాణంలో పనిచేసే సుమారు 20 మందిని క్వారంటైన్ కి తరలించారు..

దుకాణాన్ని ఇవాళ మూసివేయించారు. అంతేకాదు దుకాణాన్ని శానిటేషన్ చేయనున్నారు. ప్రతి రోజూ వందలాది మంది ఈ చాట్ సెంటర్ కు వస్తుంటారు.  రెండు రోజులుగా ఎవరెవరు ఇక్కడికి వచ్చి తినుబండారాలను కొనుగోలు చేశారనే విషయమై  కూడా అధఘికారులు ఆరా తీస్తున్నారు.వీరికి కూడ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 

click me!