నాగార్జునసాగర్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

Published : Jul 23, 2021, 11:05 AM IST
నాగార్జునసాగర్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

సారాంశం

 నాగార్జునసాగర్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. ఆర్ధిక ఇబ్బందులు,  అనారోగ్య సమస్యలతో  ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా బాధితులు  సూసైడ్ నోట్ రాశారు. ఈ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

నల్గొండ:నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్  కొత్త బ్రిడ్జిపై నుండి దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు. ఆర్ధిక ఇబ్బందులే కారణమని  పోలీసులు గుర్తించారు.నాగార్జునసాగర్ కు చెందిన రామయ్య, నాగమణి దంపతులు. వీరికి సాత్విక్ అనే కొడుకున్నాడు.ఆర్ధిక ఇబ్బందులతో పాటు  అనారోగ్య సమస్యలు ఈ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశాయి.  

దీంతో ఆత్మహత్య చేసుకోవాలని ఆ కుటుంబం భావించింది. శుక్రవారం నాడు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కొత్త బ్రిడ్జి నుండి సాగర్ కాలువలో ముగ్గురు దూకారు. దీంతో అక్కడికక్కడే ఈ ముగ్గురు మరణించారు. మృతుల నుండి పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకొన్నారు.తమ ఆత్మహత్యకు గల కారణాలను ఆ లేఖలో వివరించారు. ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏ రకంగా ఇబ్బందిపెట్టాయో ఆ లేఖలో వారు వివరించారు.మృతదేహలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపారు పోలీసులు.పోస్టు మార్టం తర్వాత మృతదేహాలను  బంధువులకు అప్పగించనున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

 


 

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?