తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని రాష్ట్రానికి 20 వేల కేంద్ర బలగాలను రప్పించనుంది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల సేవలను ఈసీ వినియోగించనుంది.
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 20 వేల కేంద్ర బలగాల సిబ్బందిని సేవలను వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర పారా మిలటరీ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. రెండు మూడు రోజుల్లో కేంద్ర బలగాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి.
ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేంద్ర బలగాల సేవలను వినియోగించుకొంటారు. మావోయిస్టు ప్రభావం ఉన్న సమయంలో కేంద్ర బలగాలను ఆ ప్రాంతాల్లో వినియోగించుకొనేవారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుండి పోలింగ్ ను సక్రమంగా నిర్వహించడంతో పాటు బ్యాలెట్ బాక్సులు లేదా ఈవీఎంలను సురక్షితంగా కౌంటింగ్ కేంద్రానికి చేర్చడంలో భద్రతా సిబ్బంది కీలకంగా వ్యవహరించేవారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం ప్రస్తుతం తగ్గింది. 2004కు ముందు మావోయిస్టు ప్రాబల్యం ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉండేది.
undefined
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను మోహరించనుంది ఈసీ. రాష్ట్రంలోని భద్రతా సిబ్బందితో పాటు కేంద్రం నుండి వచ్చే 20 వేల బలగాల సేవలను ఈసీ వినియోగించుకోనుంది.
100 కంపెనీల నుండి 20వేల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. ఒక్కో టీమ్ లో 60 నుండి 80 మంది సిబ్బంది ఉంటారు.