తెలంగాణలో పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 2,070 మందికి పాజిటివ్.. హైదరాబాద్‌లోనూ తగ్గుదల

Siva Kodati |  
Published : Jun 05, 2021, 09:04 PM IST
తెలంగాణలో పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 2,070 మందికి పాజిటివ్.. హైదరాబాద్‌లోనూ తగ్గుదల

సారాంశం

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా గడచిన 24 గంటల్లో 1,38,182 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,070 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా గడచిన 24 గంటల్లో 1,38,182 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,070 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,89,734కి చేరింది. ఇవాళ 18 మంది కరోనా వల్ల మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3,364కి పెరిగింది. నిన్న ఒక్క రోజే వైరస్ బారి నుంచి 3,762 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,208 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 9, భద్రాద్రి కొత్తగూడెం 120, జీహెచ్ఎంసీ 245, జగిత్యాల 46, జనగామ 35, జయశంకర్ భూపాలపల్లి 53, గద్వాల 26, కామారెడ్డి 8, కరీంనగర్ 81, ఖమ్మం 172, మహబూబ్‌నగర్ 60, ఆసిఫాబాద్ 9, మహబూబాబాద్ 69, మంచిర్యాల 75, మెదక్ 18, మేడ్చల్ మల్కాజిగిరి 80, ములుగు 69, నాగర్ కర్నూల్ 27, నల్గగొండ 156, నారాయణపేట 12, నిర్మల్ 11, నిజామాబాద్ 25, పెద్దపల్లి 81, సిరిసిల్ల 44, రంగారెడ్డి 92, సిద్దిపేట 72, సంగారెడ్డి 52, సూర్యాపేట 95, వికారాబాద్ 52, వనపర్తి 36, వరంగల్ రూరల్ 35, వరంగల్ అర్బన్ 61, యాదాద్రి భువనగిరిలో 44 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : రుతుపవనాలు అలర్ట్, అల్పపీడనం క్రియేట్, ద్రోణి, ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలపై ఇక వర్షాల దండయాత్రే, ఈదురుగాలులతో దబిడిదిబిడే
Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu