ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. 20ఏళ్ల జైలు శిక్ష

Published : Mar 25, 2021, 07:38 AM IST
ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. 20ఏళ్ల జైలు శిక్ష

సారాంశం

అక్కడ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అభం, శుభం తెలియని ఆరేళ్ల పసిదానిపై ఓ వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. చిన్నారి అనే కనికరం లేకుండా.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఆ లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి తాజాగా పోలీసులు 20ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామానికి చెందిన గరేళ్లి కొండయ్య 2018లో మేస్త్రీ పనికోసం మధిర మండలంలోని ఓ గ్రామానికి వచ్చాడు. అక్కడ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా.. పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయస్థానం నిందితుడిపై నేరం రుజువు కావడంతో... 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana