గాంధీలో 20 మంది చిన్నారులకు కరోనా చికిత్స: నేడు నలుగురు డిశ్చార్జ్

By narsimha lode  |  First Published Apr 15, 2020, 2:40 PM IST
గాంధీ ఆసుపత్రిలో 20 మంది చిన్నారులు కరోనా చికిత్స తీసుకొంటున్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రిలో సుమారు 400 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.. ఈ ఆసుపత్రిలో చేరిన రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందిస్తున్నట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో 20 మంది చిన్నారులు కరోనా చికిత్స తీసుకొంటున్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రిలో సుమారు 400 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.. ఈ ఆసుపత్రిలో చేరిన రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందిస్తున్నట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా కేటాయించారు. జిల్లాలతో పాటు హైద్రాబాద్ కు చెందిన పలువురు కరోనా రోగులను గాంధీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నిర్వహిస్తున్నారు. 

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో సుమారు 20 మంది చిన్నారులు కూడ ఉన్నారు.  వీరిలో నలుగురు కోలుకొన్నారు. వీరిని బుధవారం నాడు డిశ్చార్జ్ చేయనున్నారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ మేరకు చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

చిన్నారులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డును కేటాయించారు. గాంధీలోని ఐదు నుండి ఏడు వార్డుల వరకు కరోనా రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రతి ఫ్లోర్‌కు పది మంది డాక్టర్ల బృందం చికిత్స అందించనుంది.

8వ వార్డులో కరోనా అనుమానిత రోగులు మాత్రమే ఉంటారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స అందించనున్నారు. సీరియస్ కేసులను ప్రత్యేక వార్డులకు తరలించనున్నారు. సాధారణ కరోనా రోగులను ఐదు నుండి ఏడు వార్డులకు తరలిస్తారు.

also read:కరోనా: అఫిడవిట్ దాఖలుకు ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

ఈ ఆసుపత్రిలో 1500 బెడ్స్ ను కూడ సిద్దం చేశారు. ఈ ఆసుపత్రిలో ఉన్న రోగులు కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ చెప్పారు.


 
click me!