ప్రాణం తీసిన వేగం: కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టిన బైక్.. ఎగిరిపడిన యువకుల మృతదేహాలు

Siva Kodati |  
Published : Aug 27, 2020, 07:16 PM IST
ప్రాణం తీసిన వేగం: కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టిన బైక్.. ఎగిరిపడిన యువకుల మృతదేహాలు

సారాంశం

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ సర్కిల్ సమీపంలోని మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. దుర్గానగర్ చౌరస్తాలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అతివేగంగా ప్రయాణిస్తూ రోడ్డు మధ్యలో వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. 

ప్రమాదంలో ఇద్దరు యువకులు  అక్కడికక్కడే మరణించారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్తంభాన్ని ఢీకొట్టిన అనంతరం వీరిద్దరి మృతదేహాలు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మృతులను ఆరాంఘర్‌కు చెందిన ఎండీ సజ్జాద్, మహ్మద్ నిజాముద్దీన్‌గా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad Traffic : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్స్ లో వెళ్ళారో బుక్ అవ్వడం ఖాయం
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు