అక్రమ లేఅవుట్లకు కళ్లెం: మరోసారి ఎల్‌ఆర్ఎస్ స్కీం దిశగా తెలంగాణ సర్కార్

By Siva KodatiFirst Published Aug 27, 2020, 6:13 PM IST
Highlights

మరోసారి ఎల్ఆర్ఎస్ స్కీంపై ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గత స్కీంలో మార్పులతో కొత్త స్కీం తీసుకురానుంది

మరోసారి ఎల్ఆర్ఎస్ స్కీంపై ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గత స్కీంలో మార్పులతో కొత్త స్కీం తీసుకురానుంది. డీటీసీపీ, హెచ్ఎండీఏ పర్మిషన్ లేని లేఔట్లతో ఉన్న వ్యక్తిగత ఫ్లాట్స్ క్రమబద్ధీకరించేందుకు ఐఆర్ఎస్ స్కీం ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం.

ఆగస్టు 15 లోపు రిజిస్టర్ చేసుకున్న ఫ్లాట్స్‌కు అనుమతి వుంటుంది. దరఖాస్తు ఫీజు తగ్గింపు, రెగ్యులరైజ్ ఫీజును కూడా తగ్గించే అవకాశం వుంది. కొనుగోలుదారులు మోసపోకుండా చూడటంతో పాటు నగరాలు, పట్టణాలలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది.

కాగా, అక్రమ లేఅవుట్లకు చెక్ పెట్టేందుకు గాను అనుమతులు లేని స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా నిషేధిస్తూ నిన్న టీఎస్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

click me!