గుండెను పిండేసే దృశ్యం: తండ్రి శవం వద్ద కూతురు శోకం

Published : May 31, 2019, 12:37 PM IST
గుండెను పిండేసే దృశ్యం: తండ్రి శవం వద్ద కూతురు శోకం

సారాంశం

 నల్గొండ మండలంలోని చర్లపల్లి వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు  వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మరణించిన ఓ వ్యక్తి కూతురు  డాడీ... లే... డాడీ లేవండి అంటూ రోదించింది

నల్గొండ: నల్గొండ మండలంలోని చర్లపల్లి వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు  వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మరణించిన ఓ వ్యక్తి కూతురు  డాడీ... లే... డాడీ లేవండి అంటూ రోదించింది. రక్తపు మడుగులో ఉన్న తన తండ్రి మృతదేహన్ని పట్టుకొని 
ఆ యువతి ఏడుస్తున్న దృశ్యాలను చూసి స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 

నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ కామినేని ఆసుపత్రిలో విధులకు హాజరయ్యేందుకు శుక్రవారం నాడు బైక్‌పై బయలు దేరారు. వీరు ప్రయాణీస్తున్న బైక్‌ను  చర్లపల్లి వద్ద  డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న శ్రీనివాస్ రావు...చింత నరసింహలు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనలో మరణించిన ఓ వ్యక్తి కూతురు తన తండ్రి మృతదేహంపై పడి ఏడ్చింది. డాడీ లేవండి డాడీ... లే.... అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. రక్తపు మడుగులో ఉన్న తన తండ్రి మృతదేహాన్ని పట్టుకొని ఆ యువతి తన తండ్రిని లేవాలని ఏడ్చింది.

ఆ యువతి తన తండ్రిని పట్టుకొని పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు పలువురిని కంటతడిపెట్టించాయి.రోడ్డుపై ఉన్న మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన పోలీసులు కూడ ఆ యువతి ఏడుస్తున్న దృశ్యాలను చూసీ కొద్దిసేపు అలాగే ఉండిపోయారు.


 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu