
హైదరాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ హఠాన్మరణాలు కలకలం రేపుతున్నాయి. చూస్తూ చూస్తుండగానే కళ్లముందే పిట్టల్లా రాలిపోతున్నారు. రోజువారీ పనుల్లోనూ నిమగ్నమైన వారు సడెన్‌గా మరణిస్తున్నారు. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి ఖమ్మంలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలోని రేపల్లెవాడకు చెందిన షేక్ ఖాసీంపాషా మంగళవారం గుండెపోటుతో మరణించాడు. ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 19 ఏళ్ల షేక్ ఖాసీంపాషాకు మంగళవారం రాత్రి గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో బంధువులు ఆయనను ఖమ్మం హాస్పిటల్ తీసుకెళ్లారు.
కానీ, ఖాసీంపాషా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. ఖాసీంపాషా మృతదేహాన్ని స్వగ్రామం రేపల్లెవాడకు తరలించారు.
Also Read: బండి అరెస్టుపై బీజేపీ అధిష్టానం సీరియస్! ఎండగట్టండి, అండగా ఉంటాం.. ‘ప్రధాని పర్యటన విఫలం చేయడానికే’
ఖాసీంపాషా తండ్రి కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. తల్లి మైబూబీ కూలి పనులకు వెళ్తూ ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా, పై చదువుల కోసం వెళ్లిన కుమారుడు మృతదేహమై ఇంటికి రావడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు.