తెలంగాణలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 1,801 కేసులు.. పెరుగుతున్న రికవరీలు

Siva Kodati |  
Published : May 30, 2021, 09:35 PM ISTUpdated : May 30, 2021, 09:36 PM IST
తెలంగాణలో కరోనా తగ్గుముఖం:  కొత్తగా 1,801 కేసులు.. పెరుగుతున్న రికవరీలు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,801 పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,801 పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.  ఇటీవల కాలంలో ఇదే అత్యల్పం. గత కొన్నివారాలతో పోల్చితే తొలిసారిగా 2 వేల లోపున పాజిటివ్ కేసులు నమోదవ్వడం శుభపరిణామమని అధికార వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో 3,660 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,75,827 మందికి వైరస్ సోకగా.. 5,37,522 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35,042 యాక్టీవ్ కేసులున్నాయి. ఇవాళ నమోదైన మరణాలతో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,263కి చేరింది. రికవరీ రేటు 93.34 శాతానికి పెరిగింది. ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 390 కొత్త కేసులు నమోదయ్యాయి. 

Also Read:తెలంగాణలో జూన్ 10 వరకు లాక్‌డౌన్ ... మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 75, జగిత్యాల 49, జనగామ  15, జయశంకర్ భూపాలపల్లి 29, గద్వాల 25, కామారెడ్డి  4, కరీంనగర్ 92, ఖమ్మం 82, మహబూబ్‌నగర్ 69, ఆసిఫాబాద్ 9, మహబూబాబాద్ 60, మంచిర్యాల 47, మెదక్ 15, మేడ్చల్ మల్కాజిగిరి 101, ములుగు 12, నాగర్ కర్నూల్ 38, నల్గగొండ 45, నారాయణపేట 10, నిర్మల్ 3, నిజామాబాద్ 19, పెద్దపల్లి 68, సిరిసిల్ల 26, రంగారెడ్డి 114, సిద్దిపేట 76, సంగారెడ్డి 68, సూర్యాపేట 29, వికారాబాద్ 50, వనపర్తి 55, వరంగల్ రూరల్ 61, వరంగల్ అర్బన్ 54, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్