జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి ఫేక్ సర్టిఫికెట్ల దందా.. 18 మంది గ్యాంగ్ అరెస్ట్

Siva Kodati |  
Published : Sep 19, 2023, 07:22 PM IST
జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి ఫేక్ సర్టిఫికెట్ల దందా.. 18 మంది గ్యాంగ్ అరెస్ట్

సారాంశం

జీహెచ్ఎంసీ పరిధిలో రెవెన్యూ, మున్సిపల్ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 18 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ అనుమతుల పత్రాలు, ల్యాండ్ డాక్యుమెంట్లను ఈ గ్యాంగ్ తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి నకిలీ సర్టిఫికెట్ల దందా బయటపడింది. రెవెన్యూ, మున్సిపల్ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 18 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పలు శాఖలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను ఈ గ్యాంగ్ తయారుచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ అనుమతుల పత్రాలు, ల్యాండ్ డాక్యుమెంట్లను ఈ గ్యాంగ్ తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బ్యాంక్ ద్వారా రుణాలు పొందడానికి కూడా నకిలీ సర్టిఫికెట్లను వీరు తయారు చేస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?