బ్రేకింగ్.. హైదరాబాద్ లో ఒకే కుటుంబంలో 17మందికి కరోనా

By telugu news teamFirst Published Apr 15, 2020, 8:08 AM IST
Highlights
ఆమెకు కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 13న ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఊహించని విధంగా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. నగరంలోని ఓ కుటుంబంలో 17మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌లోని తలాబ్‌కట్టకు చెందిన ఒక మహిళ ఏప్రిల్ 10న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఆమెకు కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 13న ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది.

దాంతో, వైద్య అధికారులు అప్రమత్తమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారికి కలిపి మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 17 మందికి కోవిడ్ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయిందని అధికారులు తెలిపారు. వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 24 మందిని కూడా ప్రభుత్వ నిజామియా హాస్పిటల్‌లో క్వారెంటైన్‌కు తరలించారు.

చనిపోయిన మహిళ వయసు 60ఏళ్లు ఉంటాయని అధికారులు చెప్పారు. గుండె నొప్పితో ఆమె ఏప్రిల్ 9వ తేదీన నాంపల్లిలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడి నుంచి గాంధీకి... అక్కడి నుంచి కింగ్ కోఠి హాస్పిటల్ కి పంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి మరో ప్రైవేటు హాస్పిటల్ కి పంపగా.. అక్కడ చనిపోయారు. అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ తేలింది.
click me!