తెలంగాణ కరోనా అప్‌డేట్: భారీగా పడిపోయిన కేసులు.. కొత్తగా 1,492 మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Jun 17, 2021, 08:28 PM IST
తెలంగాణ కరోనా అప్‌డేట్: భారీగా పడిపోయిన కేసులు.. కొత్తగా 1,492 మందికి పాజిటివ్

సారాంశం

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,492 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 166 మందికి కరోనా నిర్ధారణ కాగా, ఖమ్మం జిల్లాలో 129, నల్గొండ జిల్లాలో 115 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 1 కేసు నమోదైంది.

ఇదే సమయంలో రాష్ట్రంలో 1,933 మంది కరోనా నుంచి కోలుకోగా, 13 మంది వైరస్ బారినపడి మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,534కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,09,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,86,362 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 19,521 యాక్టివ్ కేసులు వున్నాయి. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 91, జీహెచ్ఎంసీ 166, జగిత్యాల 26, జనగామ 14, జయశంకర్ భూపాలపల్లి 25, గద్వాల 15, కామారెడ్డి 6, కరీంనగర్ 92, ఖమ్మం 129, మహబూబ్‌నగర్ 29, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 67, మంచిర్యాల 49, మెదక్ 13, మేడ్చల్ మల్కాజిగిరి 83, ములుగు 31, నాగర్ కర్నూల్ 16, నల్గగొండ 115, నారాయణపేట 9, నిర్మల్ 7, నిజామాబాద్ 8, పెద్దపల్లి 59, సిరిసిల్ల 28, రంగారెడ్డి 92, సిద్దిపేట 53, సంగారెడ్డి 18, సూర్యాపేట 89, వికారాబాద్ 19, వనపర్తి 27, వరంగల్ రూరల్ 20, వరంగల్ అర్బన్ 65, యాదాద్రి భువనగిరిలో 27 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే... ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?