కరోనా కలకలం... ఫీవర్ ఆస్పత్రిలో 14మంది అనుమానితులు

By telugu news teamFirst Published Mar 17, 2020, 8:55 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో యువకుడు(26), నగరంలోని సైదాబాద్ కు చెందిన ముగ్గురు కరోనా అనుమానిత లక్షణాలతో ఫీవర్ ఆస్పత్రిలో చేరారు. వీరిని ఐసోలేషన్ వార్డులో చేర్పించి వైద్య సేవలు అందజేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు.

కరోనా కలకలం రోజు రోజుకీ పెరిగిపోతోంది. హైదరాబాద్ నగరంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగోతంది. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. కాగా.. తాజాగా కరోనా అనుమానితులు దాదాపు 14మంది నల్లకుంట ఫీవరాసుపత్రిలో చేరారరు. ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన వారసిగూడకు చెందిన యువకుడు(27), అంబర్ పేటకు చెందిన యువతి(24) కరోనా భయంతో సోమవారం ఉదయం ఆస్పత్రిలో చేరారు.

Also Read తెలంగాణలో మరో కరోనా కేసు...హైదరాబాద్ లో అలర్ట్...

ఇండోనేషియా నుంచి ఇటీవల కరీంనగర్ లోని సొంత గ్రామానికి వచ్చిన దాదాపు ఎనిమిది మంది జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో రాత్రి ఫీవర్ ఆస్పత్రిలో చేరారు. వీరిలో 25 నుంచి 30ఏళ్ల మధ్య వయసు ఉన్న నలుగురు యువకులు, 51 నుంచి 64ఏళ్ల మధ్య ఉన్న పెద్దలు నలుగురు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో యువకుడు(26), నగరంలోని సైదాబాద్ కు చెందిన ముగ్గురు కరోనా అనుమానిత లక్షణాలతో ఫీవర్ ఆస్పత్రిలో చేరారు. వీరిని ఐసోలేషన్ వార్డులో చేర్పించి వైద్య సేవలు అందజేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు.

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రోగులతో ఫీవరాసుపత్రి ఓపీ రద్దీగా మారింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 938 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారరు. 27మంది పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. 

click me!