ఫలించిన కవిత కృషి: హైదరాబాద్‌ చేరుకున్న 14 మంది గల్ఫ్ బాధితులు

By sivanagaprasad kodatiFirst Published Jan 30, 2019, 11:00 AM IST
Highlights

ఇరాక్‌లో చిక్కుకున్న 14 మంది గల్ఫ్ బాధితులకు విముక్లి లభించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 14 మంది ఏజెంట్ చేతిలో మోసపోయి ఐదు నెలలుగా నానా హింసలు అనుభవించారు. కుటుంబానికి దూరమై దేశం కానీ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిపై మీడియాలో కథనాలు రావడంతో నిజామాబాద్ ఎంపీ కవిత స్పందించారు. 

ఇరాక్‌లో చిక్కుకున్న 14 మంది గల్ఫ్ బాధితులకు విముక్లి లభించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 14 మంది ఏజెంట్ చేతిలో మోసపోయి ఐదు నెలలుగా నానా హింసలు అనుభవించారు.

కుటుంబానికి దూరమై దేశం కానీ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిపై మీడియాలో కథనాలు రావడంతో నిజామాబాద్ ఎంపీ కవిత స్పందించారు. ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడారు.

కవిత చొరవతో 14 మందిని ఇరాక్ ప్రభుత్వం భారత్‌కు పంపింది. వారంతా ఏ ఉద్యోగం లేకపోవడంతో ఐదు నెలల పాటు ఒకే గదీలో బందీలుగా ఉండిపోయారు. కనీసం స్వదేశానికి రావడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవు.

దీంతో ఇరాక్ నుంచి ఢిల్లీకి విమాన ఛార్జీలతో పాటు, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రైల్వే టికెట్లను, భోజన ఖర్చులను కవిత ఏర్పాటు చేశారు. ఉదయం కాచీగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వీరిని స్వస్థలాలకు వెళ్లేందుకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. తమను విడిపించినందుకు బాధితులు వారి కుటుంబసభ్యులు ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.
 

click me!