తెలంగాణలో భారీగా పడిపోయిన కేసులు.. కొత్తగా 1362 మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Jun 19, 2021, 09:26 PM IST
తెలంగాణలో భారీగా పడిపోయిన కేసులు.. కొత్తగా 1362 మందికి పాజిటివ్

సారాంశం

తెలంగాణలో కేసులు భారీగా పడిపోయాయి. గడచిన 24 గంటల్లో 1,23,005 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,362 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 1,813 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణలో కేసులు భారీగా పడిపోయాయి. గడచిన 24 గంటల్లో 1,23,005 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,362 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 1,813 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం హోం ఐసోలేష‌న్‌లో, ఆసుప‌త్రుల్లో 18,568 మంది చికిత్స తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,12,196కి చేరుకుంది. ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి 5,90,072 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3,556 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 96.38 శాతంగా ఉండగా.. జాతీయ రికవరీ రేటు 96.12 శాతంగా ఉంది

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 81, జీహెచ్ఎంసీ 145, జగిత్యాల 25, జనగామ 16, జయశంకర్ భూపాలపల్లి 25, గద్వాల 9, కామారెడ్డి 3, కరీంనగర్ 84, ఖమ్మం 122, మహబూబ్‌నగర్ 26, ఆసిఫాబాద్ 5, మహబూబాబాద్ 66, మంచిర్యాల 42, మెదక్ 8, మేడ్చల్ మల్కాజిగిరి 66, ములుగు 24, నాగర్ కర్నూల్ 16, నల్గగొండ 83, నారాయణపేట 7, నిర్మల్ 5, నిజామాబాద్ 6, పెద్దపల్లి 58, సిరిసిల్ల 26, రంగారెడ్డి 97, సిద్దిపేట 41, సంగారెడ్డి 24, సూర్యాపేట 89, వికారాబాద్ 26, వనపర్తి 34, వరంగల్ రూరల్ 19, వరంగల్ అర్బన్ 52, యాదాద్రి భువనగిరిలో 27 చొప్పున కేసులు నమోదయ్యాయి. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ