పోడు భూముల వ్యవహారం: సాగు చేస్తుండగా దళితుల్ని అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jun 19, 2021, 8:33 PM IST
Highlights

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో పోడు భూముల వివాదం రాజుకుంది. గర్జనపల్లిలో 80 ఎకరాల పోడు భూమిని దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. ఇటీవల హారితహారంలో భాగంగా ఆ భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటే ప్రయత్నం చేయగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో పోడు భూముల వివాదం రాజుకుంది. గర్జనపల్లిలో 80 ఎకరాల పోడు భూమిని దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. ఇటీవల హారితహారంలో భాగంగా ఆ భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటే ప్రయత్నం చేయగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇవాళ దళితులు ఆ పోడు భూముల్లో సాగు చేస్తుండగా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు దళితులకు మధ్య వాగ్వాదం జరిగింది.  మరోవైపు రైతులకు మద్దతుగా పోడు భూముల దగ్గరకు చేరుకున్నారు బీజేపీ నేతలు.  ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను గుంజుకోవటం సరికాదంటున్నారు. అయితే తాము ఫారెస్ట్ అధికారులతో మాట్లాడుతామని పోలీసులు చెప్పటంతో వెనక్కి తగ్గారు గ్రామస్తులు. పోలీసుల హామీతో తిరిగి గ్రామానికి వెళ్లారు.

click me!