తెలంగాణలో నిలకడగా కరోనా: 12 వందలకు పడిపోయిన కేసులు.. జీహెచ్ఎంసీ అత్యధికం

Siva Kodati |  
Published : Jun 13, 2021, 08:30 PM ISTUpdated : Jun 13, 2021, 08:31 PM IST
తెలంగాణలో నిలకడగా కరోనా: 12 వందలకు పడిపోయిన కేసులు.. జీహెచ్ఎంసీ అత్యధికం

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు మరింతగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 91,621 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,280 పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 15 మంది మరణించారు

తెలంగాణలో కరోనా కేసులు మరింతగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 91,621 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,280 పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 15 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,484కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,261 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 95.91 శాతానికి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 69, జీహెచ్ఎంసీ 165, జగిత్యాల 24, జనగామ 8, జయశంకర్ భూపాలపల్లి 16, గద్వాల 14, కామారెడ్డి 1, కరీంనగర్ 74, ఖమ్మం 156, మహబూబ్‌నగర్ 40, ఆసిఫాబాద్ 5, మహబూబాబాద్ 52, మంచిర్యాల 35, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 49, ములుగు 12, నాగర్ కర్నూల్ 14, నల్గగొండ 80, నారాయణపేట 5, నిర్మల్ 4, నిజామాబాద్ 17, పెద్దపల్లి 48, సిరిసిల్ల 14, రంగారెడ్డి 76, సిద్దిపేట 46, సంగారెడ్డి 38, సూర్యాపేట 59, వికారాబాద్ 25, వనపర్తి 18, వరంగల్ రూరల్ 29, వరంగల్ అర్బన్ 55, యాదాద్రి భువనగిరిలో 23 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu