3 వేలు క్రాస్ చేసిన తెలంగాణ: కొత్తగా 129 మందికి పాజిటివ్, హైదరాబాద్‌లో 108 కేసులు

By Siva KodatiFirst Published Jun 3, 2020, 8:58 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసుల ఉద్దృతి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా బుధవారం మరో 129 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి తెలంగాణలో కేసుల సంఖ్య 3,020కి చేరింది

తెలంగాణలో కరోనా కేసుల ఉద్దృతి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా బుధవారం మరో 129 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి తెలంగాణలో కేసుల సంఖ్య 3,020కి చేరింది. రాష్ట్రంలో 1,556 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 1,365 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బుధవారం ఏడుగురు మరణించడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 99కి చేరుకుంది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 108 మందికి పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. 129 కేసుల్లో 127 తెలంగాణ పరిధిలోనివి కాగా, ఇద్దరు వలస కూాలీలకు కోవిడ్ 19 సోకింది.

Also Read:మూడు మెడికల్ కాలేజీల్లో కరోనా కలకలం: 600 మంది క్వారంటైన్‌కి తరలింపు

రంగారెడ్డి, ఆసిఫాబాద్‌లో ఆరేసి కేసులు, సిరిసిల్ల, మేడ్చల్‌ జిల్లాల్లో రెండేసి కేసులు, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 

తెలంగాణ రాష్ట్రంలోని వైద్య కాలేజీ విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ మెడికల్ కాలేజీ విద్యార్థులను క్వారంటైన్ కు తరలించారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వైద్య కాలేజీలకు చెందిన 600 మంది విద్యార్థులను క్వారంటైన్‌కి తరలించారు.

హైద్రాబాద్‌లోని మూడు వైద్య కాలేజీల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కూడ రోజు రోజుకు కరోనా కేసులు కూడ పెరిగిపోతున్నాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ లో ఉన్న 280 మందిని క్వారంటైన్ చేశారు.

Also Read:నిమ్స్‌లో కరోనా కలకలం: నలుగురు వైద్యులు, ముగ్గురు ల్యాబ్ సిబ్బందికి కరోనా

గాంధీ కాలేజీలో 250 మంది విద్యార్థులను క్వారంటైన్ కు తరలించారు. గాంధీ కాలేజీలో 250 మంది విద్యార్థులను కూడ క్వారంటైన్ కు తరలించారు.నిమ్స్ మెడికల్ కాలేజీలో 95 మంది క్వారంటైన్ లో ఉన్నారు.

పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ను ఉపయోగించాలని కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించింది

click me!