ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాన్వాయ్‌పై ఫైన్లు వేసిన ట్రాఫిక్ పోలీసులు: ఎంతో తెలుసా..?

By Siva KodatiFirst Published Jun 3, 2020, 6:37 PM IST
Highlights

చట్టానికి ఎవరు అతీతులు కారు.. ప్రజాస్వామ్యంలో తప్పుచేస్తే, ప్రజలైనా నాయకులైనా ఒకటేనని రుజువు చేశారు తెలంగాణ పోలీసులు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే జరిమానా విధించారు. 

చట్టానికి ఎవరు అతీతులు కారు.. ప్రజాస్వామ్యంలో తప్పుచేస్తే, ప్రజలైనా నాయకులైనా ఒకటేనని రుజువు చేశారు తెలంగాణ పోలీసులు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే జరిమానా విధించారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే సామాన్యులకు భారీ ఫైన్ వేస్తారు. ఈ నేపథ్యంలో సీఎం కాన్వాయ్ సైతం నిబంధనలకు అతీతం కాదని చెబుతూ ఆయన వాహనాలకు జరిమానా విధించారు.

వివరాల్లోకి వెళితే... కేసీఆర్ కాన్వాయ్‌పై ఓవర్ స్పీడ్‌కు సంబంధించి నాలుగు జరిమానాలు వేశారు. వీటిలో హైదరాబాద్ రెండు, సైబరాబాద్‌లో ఒకటి, సూర్యాపేట జిల్లాలో మరోకటి. గతేడాది అక్టోబర్ 16న కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో సీఎం వాహనానికి తొలిసారి ఫైన్ వేశారు.

ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 15న మాదాపూర్ పరిధిలో రెండోది, ఏప్రిల్ 29న టోలిచౌకి పరిధిలో మూడోది, జూన్ 1న ట్యాంక్ బండ్ పరిధిలో నాలుగో ఫైన్ విధించారు.

కేసీఆర్ కాన్వాయ్‌కు ట్రాఫిక్  పోలీసులు జరిమానా విధించినట్లు మీడియాలో వార్తలు రావడంతో వెంటనే స్పందించిన సీఎంవో కార్యాలయ అధికారులు ఫైన్లు చెల్లించినట్లుగా తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులకు చెందిన ఈ- చలానాలో కారుకు సంబంధించిన విషయాలు నో పెండింగ్ చలాన్స్‌గా చూపిస్తున్నాయి. 

click me!