హైద్రాబాద్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం: నాలా సమీపంలో సైకిల్ లభ్యం

Published : Sep 18, 2020, 11:20 AM IST
హైద్రాబాద్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం: నాలా సమీపంలో సైకిల్ లభ్యం

సారాంశం

ఇంటి నుండి బయటికి వెళ్లిన ఓ బాలిక కన్పించకుండా పోయింది. బాలిక ఉపయోగించిన సైకిల్ ను నాలా వద్ద గుర్తించారు పోలీసులు. నాలాలో బాలిక పడిపోయిందా అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. నాలాలో బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


హైదరాబాద్: ఇంటి నుండి బయటికి వెళ్లిన ఓ బాలిక కన్పించకుండా పోయింది. బాలిక ఉపయోగించిన సైకిల్ ను నాలా వద్ద గుర్తించారు పోలీసులు. నాలాలో బాలిక పడిపోయిందా అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. నాలాలో బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నగరంలోని నేరేడ్‌మెట్ కాకతీయ నగర్ లో తల్లిదండ్రులతో కలిసి సుమేధ కపురియా అనే బాలిక నివాసం ఉంటుంది. ఆ బాలిక వయస్సు 12 ఏళ్లు. గురువారంనాడు సాయంత్రం సైకిల్ పై బాలిక బయటకు వెళ్లింది. ఆమె ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు. బాలిక ఇంటి నుండి బయటకు వెళ్లిన కొంతసేపటికి భారీ వర్షం కురిసింది.

నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకు బాలిక ఇంటి నుండి వెళ్లింది. ఆ సమయంలో బాలిక తల్లి ఇంట్లో లేదు. ఆమె తల్లి ఇంటికి చేరుకొన్న తర్వాత బాలిక లేదని విషయాన్ని గుర్తించి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీన్ దయాళ్ నగర్ లోని నాళా వద్ద బాలిక ఉపయోగించిన సైకిల్ ను స్థానికులు గుర్తించి పోలీసులకు  సమాచారం ఇచ్చారు. నాలాలో పడిపోవడంతో ఆ బాలిక కొట్టుకుపోయిందేమోనని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తన కూతురు ఎక్కడున్నా క్షేమంగాను ఉంటుందని ఆమె తల్లి అభిప్రాయపడుతోంది.

PREV
click me!

Recommended Stories

సీఐడీ విచారణకు Padi Kaushik Reddy | Sammakka-Saralamma Jatara Case | BRS MLA | Asianet News Telugu
CM Revanth Reddy Speech: ఈలోపం దేశ భవిష్యత్తుకు చాలాఇబ్బందికరం | AI Challenges | Asianet News Telugu