ఉమ్మడి కుటుంబానికి కరోనా ఎఫెక్ట్: ఒక్కడి కారణంగా 12 మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Jul 18, 2020, 09:46 PM ISTUpdated : Jul 18, 2020, 10:24 PM IST
ఉమ్మడి కుటుంబానికి కరోనా ఎఫెక్ట్: ఒక్కడి కారణంగా 12 మందికి పాజిటివ్

సారాంశం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు మున్సిపల్ కమీషనర్ తెలిపారు

తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురికి వైరస్ సోకుతోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు మున్సిపల్ కమీషనర్ తెలిపారు.

ఆర్టీసీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజులుగా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే ఆయనది ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో వారందరికీ కూడా జ్వరం వచ్చింది.

Also Read:నిజామాబాద్ కలెక్టరేట్ లో కరోనా కలకలం: డీఆర్వో అటెండర్ మృతి

ఈ నేపథ్యంతో కోవిడ్ సోకిందన్న అనుమానంతో శనివారం మదీనాగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబంలోని మొత్తం 14 మంది కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేయించుకున్నారు.

ఈ క్రమంలో వీరిలో 12 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో కమీషనర్ సుజాత సిబ్బందితో ఆర్టీసీ కాలనీకి వెళ్లి పరిశీలించారు. స్థానికులంతా అప్రమత్తంగా ఉండాలని ధైర్యం చెప్పి ఆ ప్రాంతమంతా శానిటైజేషన్ చేయించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు