తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గురువారం అమాంతం పెరిగిపోయింది. గత నెల రోజుల కాలంలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజులో 117 కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గురువారం అమాంతం పెరిగిపోయింది. గత నెల రోజుల కాలంలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజులో 117 కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,216కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 844 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,345 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలావుండగా తెలంగాణలో ఇవాళ మరో ఇద్దరు వలస కూలీలకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. కాగా ఈరోజు సౌదీ నుంచి వచ్చిన వారిలో 49 మందికి కోవిడ్ 19 సోకింది. ఇవాళ కరోనాతో నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 67కి చేరింది. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 58 కొత్త కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
undefined
Also Read:షాద్ నగర్ లో కలకలం: ఒక్క సిగరెట్టుతో ముగ్గురికి కరోనా పాజిటివ్
కాగా సిగరెట్టు షేరింగ్ షాద్ నగర్ లో కొంప ముంచింది. సిగరెట్టు షేరింగ్ వల్ల తెలంగాణలోని షాద్ నగర్ లో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. షాద్ నగర్ లో ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన ముగ్గురు యువకులు ఒక్కటే సిగరెట్ ను షేర్ చేసుకున్నారు. దాంతో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది.
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన హైదరాబాదులోని జియాగుడాకు చెందిన ఓ యువకుడు షాద్ నగర్ లో అంత్యక్రియలకు హాజరయ్యాడు. అక్కడ అతను మిగతా ఇద్దరితో సిగరెట్ షేర్ చేసుకున్నాడు. అదే కొంప ముంచింది. పైగా, కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న యువకుడు కారులో షాద్ నగర్ వరకు వెళ్లాడు.
Also Read:తెలంగాణలో 2 వేలు దాటిన కరోనా కేసులు: జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న జోరు
షాద్ నగర్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వ్యక్తి జియాగుడా నుంచి షాద్ నగర్ కారులో ఎలా వెళ్లాడనే విషయంపై అరా తీస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.