బెల్లంపల్లిలో కరోనా మృత్యుఘోష: 36 గంటల్లో 11 మంది మృతి

By telugu teamFirst Published May 7, 2021, 8:49 AM IST
Highlights

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి కోవిడ్ సెంటర్ లో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోోంది. గత 36 గంటల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. నెల రోజుల్లో 30 మంది దాకా మరణించినట్లు సమాచారం.

మంచిర్యాల: తెలంగాణలోని జిల్లా బెల్లంపల్లిలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. వరుస మరణాలు సంభవిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కోవిడ్ కేంద్రంలో 36 గంటల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. 

గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8 మంది మరణించారు. ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నెల రోజుల్లో 30 మంది మరణించినట్లు తెలుస్తోంది. 

ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిస్త పొంది పరిస్థితి విషమించిన తర్వాత రోగులు ఇక్కడికి వస్తున్నారని, అందుకే తాము ఏమీ చేయలేకపోతున్నామని ప్రభుత్వ వైద్యాధికారులు అంటున్నారు 

ఇదిలావుంటే, గురువారం ఉదయం విడుదలైన బులిటెన్ ప్రకారం... తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 6026 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 4,75, 748కి చేరుకొన్నాయి.  కరోనాతో గత 24 గంటల్లో 52 మంది మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,579 చేరుకొంది. .రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 79,824 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖ తెలిపింది. ఇంకా 4,091 మంది పరీక్షల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.

గత 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్ లో056 భద్రాద్రి కొత్తగూడెంలో 093, జీహెచ్ఎంసీ పరిధిలో 1115, జగిత్యాలలో150,జనగామలో 060, జయశంకర్ భూపాలపల్లిలో075, గద్వాలలో 091,కామారెడ్డిలో 83, కరీంనగర్ లో 223,ఖమ్మంలో 205, మహబూబ్‌నగర్లో 204, ఆసిఫాబాద్ లో 052, మహబూబాబాద్ లో105,మంచిర్యాలలో 133,మెదక్ లో 71కేసులు నమోదయ్యాయి.

మల్కాజిగిరిలో418,ములుగులో55,నాగర్ కర్నూల్ లో 206,నల్గగొండలో368, నారాయణపేటలో50 నిర్మల్ లో41, నిజామాబాద్ లో130,పెద్దపల్లిలో139,సిరిసిల్లలో76,రంగారెడ్డిలో235, సిద్దిపేటలో 231సంగారెడ్డిలో235,సూర్యాపేటలో171వికారాబాద్ లో 140, వనపర్తిలో124, వరంగల్ రూరల్ లో 133,వరంగల్ అర్బన్ 224, యాదాద్రి భువనగిరిలో 166కేసులు నమోదయ్యాయి.

click me!