ఆదిలాబాద్ లో రోడ్డుపైనే నిలిచిపోయిన అంబులెన్స్: చేతులపై గర్భిణీని కల్వర్ట్ దాటించిన కుటుంబ సభ్యులు

By narsimha lode  |  First Published Jul 12, 2022, 1:08 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లే మార్గంలో కల్వర్టు కూలింది. దీంతో ఆసుపత్రికి గర్భిణీని తీసుకువెళ్లే 108 అంబులెన్స్ రోడ్డుపైనే నిలిచిపోయింది. అయితే కుటుంబసభ్యులు గర్భిణీ జయశ్రీని కల్వర్టు దాటించిన తర్వాత  మరో వాహనంలో ఆమెను ఇచ్చోడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 


ఆదిలాబాద్: ఉమ్మడి Adilabad జిల్లాలోని  ఇచ్చోడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లే మార్గంలో కల్వర్టు Flood Water ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న గర్భిణీని కటుంబ సభ్యులు చేతులపై Culvert దాటించారు. రోడ్డుకు మరో వైపు మార్గంలో 108  Ambulance ని రప్పించి  ఇచ్చోడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Ichhoda మండలంలోని Jalda గ్రామానికి చెందిన Jayasri అనే Pregnant woman పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకుగాను 108 అంబులెన్స్ కు కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. జల్దా గ్రామం నుండి జయశ్రీని తీసుకొని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో వర్షం కారణంగా కల్వర్టు కొట్టుకుపోయింది.  దీంతో రోడ్డుపైనే అంబులెన్స్ నిలిచిపోయింది.  కుటుంబ సభ్యులు జయశ్రీని తమ చేతులపై  ఎత్తుకుని కల్వర్టును దాటించడంతో ఆమె సురక్షితంగా ఆసుపత్రికి చేరింది. ఇచ్చోడ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటుంది.

Latest Videos

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ తరుణంలో జిల్లాలోని జలాశయాలు నీటితో నిండుకుండలా ఉన్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి.  వరదర ఉధృతి కారణంగా రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్న పరిస్థితి జిల్లాలో చోటు చేసుకొంది. 
 

click me!