100ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయురాలు మృతి.. చివరి కోరికేంటో తెలుసా..?

By telugu news teamFirst Published Oct 1, 2021, 5:02 PM IST
Highlights

ఆమె చివరి కోరిక మేరకు ఆమె శరీరాన్ని మల్లారెడ్డి మహిళల మెడికల్ కాలేజీ లో అందజేయడం గమనార్హం.  ఆమె కుమారుడు రఘువీర్.. ఫారెస్ట్ అధికారిగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు,

100ఏళ్ల వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది.  ఆమె గతంలో స్కూల్ టీచర్ గా పనిచేయడం గమనార్హం. కాగా.. చనిపోయే ముందు ఆమె చివరి కోరికగా.. తన శవాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వాలని కోరడం గమనార్హం. ఈ సంఘటన తెలంగాణనలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ ప్రాంతానికి చెందిన పి. లక్ష్మీ(100) పదవీ విరమణ చేసిన స్కూల్ టీచర్. వందేళ్లు నిండిన ఈ టీచరమ్మ.. గత రాత్రి ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఆమె చివరి కోరిక మేరకు ఆమె శరీరాన్ని మల్లారెడ్డి మహిళల మెడికల్ కాలేజీ లో అందజేయడం గమనార్హం.  ఆమె కుమారుడు రఘువీర్.. ఫారెస్ట్ అధికారిగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు,

ఆమె తన శరీరాన్ని దానం చేయాలని ఎప్పుడూ కోరుతుండేవారని.. ఆమె కోరిక మేరకు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు.  రిటైర్ అయిన తర్వాత కూడా ఆమె పిల్లలకు పాఠాలు చెప్పేవారి స్థానికులు పేర్కొన్నారు. 

click me!