తెలంగాణ : ఇంటర్‌లో ఇకపై వంద శాతం సిలబస్

By Siva KodatiFirst Published Jun 23, 2022, 6:43 PM IST
Highlights

తెలంగాణలో ఇంటర్‌లో వంద శాతం సిలబస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోవిడ్‌కు ముందున్న మాదిరే పాత విధానంలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. కరోనాతో గడిచిన రెండేళ్లుగా 70 శాతం సిలబస్‌తో పరీక్షలు  నిర్వహించారు.

తెలంగాణలో ఇంటర్‌లో వంద శాతం సిలబస్‌కు (telangana inter board) ప్రభుత్వం ఆమోదం (inter syllabus 2022) తెలిపింది. కోవిడ్‌కు (coronavirus) ముందున్న మాదిరే పాత విధానంలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. కరోనాతో గడిచిన రెండేళ్లుగా 70 శాతం సిలబస్‌తో పరీక్షలు  నిర్వహించారు. 

ఇకపోతే.. తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలను (telangana inter results 2022) ఈ నెల 25న విడుదల చేసే అవకాశం ఉంది. ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలను ఒకేసారి ఈనెల 25న విడుదల చేసేందుకు ఇంటర్బోర్డు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పరీక్షలన్నీ మే 24తో పూర్తికాగా అదే నెల 28 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ఫలితాలను జూన్ 20లోపు వెల్లడిస్తామని నెల రోజుల క్రితమే ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు.

అయితే.. మూల్యాంకన ప్రక్రియ మొత్తం పూర్తయినందున తప్పులు రాకుండా సాఫ్ట్‌వేర్ ద్వారా పరిశీలిస్తామన్నారు జలీల్. ఈ క్రమంలో జూన్ 25న ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

click me!