లోన్‌యాప్స్ కేసులో కొత్త కోణం : రిక్వెస్ట్ పంపకుండానే ఖాతాల్లోకి డబ్బు, ఏడు రోజుల్లో కట్టాలంటూ బెదిరింపులు

By Siva KodatiFirst Published Jun 23, 2022, 4:11 PM IST
Highlights

హైదరాబాద్ లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో డబ్బులు చెల్లించాలంటూ కీచకులు వేధిస్తున్నారు. జంట నగరాల్లో వందల సంఖ్యలో లోన్ యాప్ కేసులు నమోదు అవుతున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ లోన్ యాప్స్ కేసులో (loan apps case) కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో డబ్బులు చెల్లించాలంటూ కీచకులు వేధిస్తున్నారు. ఏడు రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే ఫోటో మార్ఫింగ్‌లు, తిట్లకు పాల్పడుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. జంట నగరాల్లో వందల సంఖ్యలో లోన్ యాప్ కేసులు నమోదు అవుతున్నాయి. తమ అనుమతి లేకుండానే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. నేరుగా యాప్ డౌన్‌లోడ్ లింక్స్ పంపుతోంది ముఠా. చైనా నుంచి ముగ్గురు ఈ దందాను ఆపరేట్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాల్ సెంటర్లు కూడా లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఈ దందా నిర్వహిస్తోంది ముఠా. గూగుల్ ట్రాన్స్‌లేషన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. 
 

click me!