తెలంగాణ: వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు.. ఆ ఒక్క యూనివర్సిటీ తప్ప

By Siva KodatiFirst Published Jun 23, 2022, 5:20 PM IST
Highlights

తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ లిస్ట్‌లో మెడికల్ యూనివర్సిటీని మినహాయించింది సర్కార్. 
 

తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని మెడికల్ యూనివర్సిటీ మినహా.. 15 వర్సిటీలలో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. కామన్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నత విద్యా మండలి ఛైర్మన్.. కళాశాల విద్య కమీషనర్ మెంబర్ కన్వీనర్‌గా, విద్యాశాఖ, ఆర్ధిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా బోర్డు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇకపోతే.. యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ ఇటీవలే సంతకం చేశారు. దీంతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా.. నియామక బోర్డు, కామన్ రిక్రూట్‌మెంట్‌కు అనుగుణంగా త్వరలో చట్టసవరణ చేయనున్నారు. 

మరోవైపు.. రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించే చర్యలను సైతం ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగా తెలంగాణలో జూనియర్ లెక్చరర్లు (junior lecturer) చదివిన యూనివర్సిటీల గుర్తింపుపై దృష్టి పెట్టింది ఇంటర్ బోర్డ్ (telangana inter board) . ఆయా యూనివర్సిటీలకు యూజీసీ గుర్తింపు వుందా లేదా అన్నది తేల్చాలని ఉన్నత విద్యా మండలిని కోరింది ఇంటర్ ఎడ్యుకేషన్ కమీషనరేట్. దీంతో రంగంలోకి దిగిన ఉన్నత విద్యా మండలి ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తోన్న 3,580 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పీజీ చేసినట్లు .. 60 యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు సమర్పించారు. 

Also REad:కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. ఆ వర్సిటీలపై ఆరా

డిస్టెన్స్ మోడ్‌లో కొందరు.. రెగ్యులర్‌గా కొందరు పీజీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆయా యూనివర్సిటీల్లో డిస్టెన్స్‌కు అనుమతి వుందా..? వుంటే దాని పరిధి ఎంత అన్నది పరిశీలించనుంది కమిటీ. నిన్న సమావేశమైన కమిటీ.. ఈ నెల 27న మరోసారి భేటీ కానుంది. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక.. అర్హులు , అనర్హుల జాబితా ఆధారంగా కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించే ప్రతిపాదనలను (contract lecturer regularisation in telangana) ప్రభుత్వానికి పంపనున్నారు ఇంటర్ విద్య కమీషనర్ . 
 

click me!