తెలంగాణ కరోనా అప్ డేట్: 13వేలకు చేరిన యాక్టివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Apr 08, 2021, 10:20 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 13వేలకు చేరిన యాక్టివ్ కేసులు

సారాంశం

గత 24గంటల్లో అంటే మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 87,332మందికి కరోనా టెస్టులు చేయగా 2055మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 87,332మందికి కరోనా టెస్టులు చేయగా 2055మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,18,704కు చేరితే టెస్టుల సంఖ్య 1,06,59,953కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 303మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,03,601కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,362యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 8,263గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1741కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.3శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 91.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 95.26శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 21, నాగర్ కర్నూల్ 25, జోగులాంబ గద్వాల 8,  కామారెడ్డి 58, ఆదిలాబాద్ 24, భూపాలపల్లి 12, జనగామ 18, జగిత్యాల 99, అసిఫాబాద్ 41, మహబూబ్ నగర్ 60, మహబూబాబాద్ 8, మెదక్ 19, నిర్మల్ 100, నిజామాబాద్ 169,  సిరిసిల్ల 36, వికారాబాద్ 38, వరంగల్ రూరల్ 11,  ములుగు 3, పెద్దపల్లి 33, సిద్దిపేట 35, సూర్యాపేట 34, భువనగిరి 23, మంచిర్యాల 57, నల్గొండ 54 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 398కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 214, రంగారెడ్డి 174, కొత్తగూడెం 10, కరీంనగర్ 77, ఖమ్మం 50,  సంగారెడ్డి 65, వరంగల్ అర్బన్ 74కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 

 

PREV
click me!

Recommended Stories

Holiday : ఈ ఒక్కరోజే స్కూళ్లు, ఆఫీసులు.. మీకు ఈ మెసేజ్ వచ్చిందో మళ్లీ సెలవే..!
Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu