మైక్రో ఫైనాన్స్ యాప్స్‌పై ఒక్క రోజే వంద ఫిర్యాదులు: దర్యాప్తు చేస్తున్న హైద్రాబాద్ పోలీసులు

By narsimha lodeFirst Published Dec 21, 2020, 2:25 PM IST
Highlights

మైక్రో ఫైనాన్స్ యాప్స్ పై రాచకొండ, సైబరాబాద్ పోలీసులకు వంద మందికి పైగా బాధితులు ఫిర్యాదు చేశారు.


హైదరాబాద్: మైక్రో ఫైనాన్స్ యాప్స్ పై రాచకొండ, సైబరాబాద్ పోలీసులకు వంద మందికి పైగా బాధితులు ఫిర్యాదు చేశారు.

ఆదివారం నాడు ఒక్క రోజునే  ఈ రెండు పోలీసు కమిషనరేట్ పరిధిల్లో వందకు పైగా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ యాప్స్ పై సంస్థలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

నిర్ణీత గడువులోపుగా ఫైనాన్స్ సంస్థలకు డబ్బులు చెల్లించకపోతే   ఆ సంస్థ ప్రతినిధులు వేధింపులకు దిగుతున్నారు.ఈ వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

మైక్రో ఫైనాన్స్ యాప్స్ సంస్థ ప్రతినిధుల వేధింపులు భరించలేక తెలుగు రాష్ట్రాల్లో  ఇటీవల కాలంలో పలువురు ఆత్మహత్యలు చేసుకొన్న ఘటనలు చోటు చేసుకొన్నాయి.ఈ విషయమై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఇటీవల స్పందించారు.

వేధింపులకు గురిచేసే మైక్రో ఫైనాన్స్ సంస్థపై ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. బాధితుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ  సంస్థలు ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నాయనే విషయాన్ని ఆరా తీస్తున్నాయి.

ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాడు ఒక్కరోజే 20కిపైగా కేసులు నమోదు చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీసులు గూగుల్ యాజమాన్యంలోని అల్పాబెట్ ఇంక్ టెక్నికల్ ఇంక్ కు టెక్నికల్ హౌస్టింగ్ వివరాలు యాప్ బేస్డ్ లోన్ ప్రొవైడర్స్ యొక్క ఆన్ లైన్ చెల్లింపు గేట్ వే లింక్ యాప్ లను అందించడానికి దర్యాప్తును వేగవంతం చేశారు.

ఆర్బీఐ ఫైనాన్స్ మోసాలపై నిరంతరం అప్రమత్తంగా చేస్తుంది. లబ్దిదారులనుండి కొన్ని సంస్థలు 18 నుండి 40 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. కొన్ని సమయాల్లో 60 నుండి 150 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో ఇలాంటి 60కి  పైగా రుణ అనువర్తనాలను పోలీసులు గుర్తించారు. 


 

click me!