తెలంగాణలో విజ‌ృంభిస్తోన్న కరోనా.. బెల్లంపల్లి ప్రభుత్వ హాస్టల్‌లో పది మంది విద్యార్థులకు పాజిటివ్

By Siva KodatiFirst Published Jul 1, 2022, 8:22 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలరు హాస్టల్ లో పది మంది విద్యార్ధులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. 

నెమ్మదించింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి దేశంలో విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, కర్ణాటక, తెలంగాణలలో కేసులు పెరుగుదల ఎక్కువగా వుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర హాస్టల్ లో కరోనా కలకలం సృష్టించింది. పది మంది విద్యార్ధులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఒక విద్యార్ధి అనారోగ్యానికి గురికావడంతో అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. ఆ విద్యార్ధికి పాజిటివ్ రావడంతో మొత్తం 364 మంది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 9 మంది విద్యార్ధులకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు కోవిడ్ సోకిన విద్యార్ధులను క్వారంటైన్ కు తరలించారు. 

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. మరోసారి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా విధించనున్నట్టుగా  ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టుకు సమాధానమిచ్చారు. 

Also REad:తెలంగాణలో మాస్క్ తప్పనిసరి.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ. 1,000 జరిమానా..!

ఓ నెటిజన్ మెట్రో రైలు ప్రయాణించే మాస్క్‌ వినియోగం గురించి ట్విట్టర్ వేదికగా  ప్రశ్నించగా.. అందకు మెట్రో యజమాన్యం స్పందించింది. ‘‘మాస్క్‌లు ధరించడమనేది మా సలహా, మా ప్రయాణీకులు మాస్క్ ధరించమని మేము సిఫార్సు చేస్తున్నాం’’ అని పేర్కొంది. దీనిపై స్పందించిన డీహెచ్ శ్రీనివాసరావు.. ‘‘కేసులు పెరుగుతున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మెట్రో రైల్‌తో సహా బహిరంగ ప్రదేశాల్లో అందరూ మాస్క్ ధరించాలని నేను కోరుతున్నాను. నిబంధన పాటించకపోతే రూ.1000/- జరిమానా ఉంటుంది’’ అని కామెంట్ చేశారు. 
 

click me!