Telangana assembly Elections 2023:2004 సెంటిమెంట్ కాంగ్రెస్ కు కలిసి వస్తుందా?

By narsimha lode  |  First Published Nov 24, 2023, 11:31 AM IST

కర్ణాటకలో అధికారాన్ని దక్కించుకున్న తర్వాత తెలంగాణపై  కాంగ్రెస్ కేంద్రీకరించింది.  కర్ణాటక ఫార్మూలాను  తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తుంది. 
 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత రెండు దఫాలు అధికారానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది.  ఈ దఫా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  వరుసగా రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అధికారంలో ఉంది.  2004 నుండి  2014 వరకు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎన్నికలు జరగడానికి కొద్ది రోజుల ముందే  కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కర్ణాటక రాష్ట్రంలో  అప్పట్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి  ఆ సమయంలో  కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా  ఉన్న  గులాం నబీ ఆజాద్  చేసిన ప్రయోగాలు ఫలితాన్ని ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర నిర్వహించారు.  తామంతా ఐక్యంగా ఉన్నామని ప్రజలకు కాంగ్రెస్ నేతలు అప్పట్లో సంకేతాలు పంపారు. ఈ ప్రయోగం  అప్పట్లో కర్ణాటకలో  మంచి ఫలితాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది.

Latest Videos

undefined

కర్ణాటకలో  కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడ   గులాం నబీ ఆజాద్ ను కాంగ్రెస్ పార్టీ  అప్పట్లో ఇంచార్జీగా నియమించింది.  కర్ణాటకలో అనుసరించిన ఫార్మూలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ  గులాం నబీ ఆజాద్  అనుసరించారు.  అప్పటికే  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  పాదయాత్ర నిర్వహించారు. అంతేకాదు  కాంగ్రెస్ నేతలతో బస్సు యాత్ర నిర్వహింపచేశారు. పార్టీ అగ్రనేతలంతా  ఈ బస్సు యాత్రలో పాల్గొన్నారు. 

ఈ నెల  30న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో  అధికారాన్ని దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.ఈ ఏడాది మే మాసంలో జరిగిన ఎన్నికల్లో  కర్ణాటకలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  కర్ణాటక ఎన్నికల సమయంలో  ఐదు గ్యారంటీలను కాంగ్రెస్  ప్రచారం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో కూడ  కర్ణాటక ఫార్మూలాను  అమలు చేస్తుంది.  తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది. బస్సు యాత్రను కూడ నిర్వహించింది.

also read:Kodad Assembly Segment... కోదాడ నుండి ఎమ్మెల్యేలుగా: 2014లో అసెంబ్లీకి ఎన్. ఉత్తమ్,పద్మావతి దంపతులు

2004 లో  కర్ణాటకలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే  కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది.  తెలంగాణలో కూడ అధికారాన్ని హస్తగతం చేసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ  ప్రయత్నాలను ప్రారంభించింది. 2004 తరహాలోనే  రెండు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న సెంటిమెంట్  ఈ దఫా  కలిసి వస్తుందో లేదో అనేది  మరో పది రోజుల్లో తేలనుంది.

2004లో కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. కర్ణాటకలో అనుసరించిన ఫార్మూలానే అప్పట్లో ఉమ్మడి ఏపీలో అమలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కర్ణాటక ఫార్మూలా అమలు చేస్తున్నారు. గత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా  అనేది త్వరలో తేలనుంది.

click me!