కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి ముందే ఓ హోటల్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో సీఎల్పీ పదవిని ఆశిస్తున్న నేతలు సమావేశమయ్యారు
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశానికి ముందే కాంగ్రెస్ కు చెందిన కొందరు సీనియర్లతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశం కావడం ప్రాధాన్యత నెలకొంది.
సీఎల్పీ సమావేశానికి ముందే పార్క్ హయత్ హోటల్ లో కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో టీపీసీసీ మాజీ చీఫ్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎల్పీ సమావేశానికి ముందే ఈ ముగ్గురు నేతలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎల్పీ సమావేశానికి ముందే ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
undefined
కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం హైద్రాబాద్ లోని ఓ హోటల్ లో సోమవారం నాడు ప్రారంభం కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 64 మంది విజయం సాధించారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి సీఎల్పీ నేతను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవికి అనుముల రేవంత్ రెడ్డితో పాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ శాసనసభపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కూడ పోటీ పడుతున్నారు.
అయితే రేవంత్ రెడ్డి వైపే మెజారిటీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపే అవకాశం ఉందనే ప్రచారం కూడ జోరుగా సాగుతుంది. అయితే సీఎం పదవి విషయంలో పోటీ పడుతున్న ఇతర నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ రకమైన హామీని ఇస్తుందోననేది సర్వత్రా ఆసక్తిగా మారింది. తెలంగాణలో రెండు దఫాలు అధికారానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. అయితే ఈ దఫా అధికారంలోకి రావడానికి సీనియర్లు ఐక్యంగా పనిచేయడంతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కృషిని కూడ కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో రేవంత్ రెడ్డికి చెందిన అనుచరులు కూడ ఉన్నారు.
కాంగ్రెస్ పార్ట ఉపాధ్యక్షుడు మల్లు రవి కూడ తన సోదరుడు మల్లు భట్టి విక్రమార్కకు బదులుగా రేవంత్ రెడ్డికే సీఎం పదవి విషయంలో మద్దతుగా నిలుస్తున్నారు. భట్టి విక్రమార్కకు తనకు ఎలాంటి విబేధాలు లేవని మల్లు రవి చెబుతున్నారు. కానీ పార్టీని అధికరారంలోకి తీసుకురావడంతో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనే అభిప్రాయంతో మల్లు రవి ఉన్నారు.
.