Amit shah... తెలంగాణ ప్రజలకు మూడు దీపావళి పండుగలు: బీజేపీ సభల్లో అమిత్ షా

Published : Nov 20, 2023, 05:15 PM IST
Amit shah... తెలంగాణ ప్రజలకు మూడు దీపావళి పండుగలు:  బీజేపీ సభల్లో  అమిత్ షా

సారాంశం

తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.


జనగామ:వచ్చే ఎన్నికలు రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జనగామలో  సోమవారంనాడు భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో నిర్వహించిన  సకల జనుల విజయ సంకల్ప సభలో  అమిత్ షా పాల్గొన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల రజాకార్ల నుండి రాష్ట్రం విముక్తి పొందిందని అమిత్ షా చెప్పారు.ఓవైసీకి భయపడి కేసీఆర్  విమోచన  దినోత్సవాలు జరపడం లేదని ఆయన  విమర్శించారు.భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే  తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుతామని   అమిత్ షా ప్రకటించారు.

తెలంగాణ ప్రజలు మూడు దీపావళి పండుగలు చేసుకోవాలన్నారు. తొలి దీపావళి ఇప్పటికే జరుపుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 డిసెంబర్ 3న బీజేపీని గెలిపించి రెండో దీపావళిని జరుపుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జనవరి 26న రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత జరుపుకోవాలని అమిత్ షా కోరారు.

 

నిజామాబాద్ లో బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆసుపత్రి, పసుపు బోర్డు కోసం ఎంపీ అరవింద్ పెద్ద పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు.బీజేపీని గెలిపిస్తే  తెలంగాణను కుటుంబ పాలన నుండి విముక్తి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. కారు స్టీరింగ్  ఓవైసీ చేతిలో ఉందన్నారు.బీజేపీని గెలిపిస్తే  మూతపడ్డ రెండు షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు