తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి : రేపే ప్రమాణ స్వీకారం , హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు .. ఈ రూట్లలో వెళ్లొద్దు

By Siva Kodati  |  First Published Dec 6, 2023, 9:35 PM IST

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో వుంటాయని హైదరాబాద్ నగర ప్రజలకు డీజీపీ రవిగుప్తా తెలిపారు


తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో వుంటాయని నగర ప్రజలకు డీజీపీ రవిగుప్తా తెలిపారు.

పబ్లిక్ గార్డెన్స్ నుంచి స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపుకు.. ఎస్బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి వైపు, ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం నుంచి వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. నగర ప్రజలు సహకరించాలని.. ట్రాఫిక్ మళ్లింపు, ఇతరత్రా ఇబ్బందులపై 9102033626 నెంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. 

Latest Videos

undefined

అంతకుముందు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమీషనర్ రొనాల్డ్ రాస్ తదితరులు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది హాజరయ్యే అవకాశాలు వున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ స్టేడియం సామర్ధ్యం 30 వేలు మాత్రమే. మిగిలిన వారి కోసం స్టేడియం బయట ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరగ్గా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలవ్వగా.. కాంగ్రెస్ దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్‌కు 39, కాంగ్రెస్‌కు 64 , బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో గెలిచాయి. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

click me!