Telangana Election Results:మెజార్టీ కాంగ్రెస్ దే కానీ.. అలా జరిగితే మళ్లీ అధికారం బీఆర్ఎస్ దే...!

By telugu news team  |  First Published Dec 3, 2023, 1:37 PM IST

 కాంగ్రెస్ 60 సీట్లకు పైగానే వచ్చే అవకాశం కనపడుతోంది. కానీ,  ఒక చిన్న ట్విస్ట్ జరిగితే, అధికారం కాంగ్రెస్ నుంచి చేజారి, బీఆర్ఎస్ చేతుల్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 119 స్థానాలకు ఈ ఎన్నిక జరగింది. కాగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. ప్రస్తుత ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తామే అధికారంలోకి వచ్చేది అని ఆ పార్టీ నేతలు ఇప్పటికే సంబరాలు చేసుకోవడం కూడా మొదలుపెట్టారు. నిజానికి 60 సీట్లు ఎవరికి వస్తే వారిదే మెజార్టీ, వారే అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ 60 సీట్లకు పైగానే వచ్చే అవకాశం కనపడుతోంది. కానీ,  ఒక చిన్న ట్విస్ట్ జరిగితే, అధికారం కాంగ్రెస్ నుంచి చేజారి, బీఆర్ఎస్ చేతుల్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.


మ్యాజిక్ నంబర్ కంటే కాస్త ముందంజలో ఉండడంతో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది. అధికార భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. 119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే 60 సీట్లకు పైగా గెలవాలి.  ఇక రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్నది కూడా నిజం.  ఒకవేళ కాంగ్రెస్ 70 సీట్లు వస్తే, ఇక ఎలాంటి డౌట్ లేకుండా అధికారం కాంగ్రెస్ దే. కానీ, అలా కాకుండా 62, 63 సీట్లతో కాంగ్రెస్ సీట్లు ఆగిపోతేనే అసలు సమస్య మొదలౌతుంది.

Latest Videos

undefined

ఇప్పటికే ఎంఐఎం.. బీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంది. అది కాదు అంటే, బీజేపీతో అయినా బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ తో  కలవడానికి రెడీ అయితే, కాంగ్రెస్ ఇరకాటంలో పడినట్లే. అంతేకాకుండా, బీఆర్ఎస్ పార్టీ.. ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురిచేసి తమవైపుకు తిప్పుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే జరిగితే, ఇంత కష్టపడి ఇన్ని సీట్లు గెలిచినా కూడా, కాంగ్రెస్ కి అధికారం చేజారే అవకాశం ఉంది.

 

హైదరాబాద్ కి డీకే శివకుమార్..

మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేయకుండా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. గెలిచిన వాళ్లను గెలిచినట్లు ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

సర్వేలు ఏం చెబుతున్నాయి.?

ఇక, సర్వేల ప్రకారం .. కాంగ్రెస్‌కు 60 నుంచి 70 సీట్లు వస్తాయని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో  ఎమ్మెల్యేల కొనుగోలు  వ్యాపారం జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రతిష్టంభన ఏర్పడితే ఏమి జరుగుతుంది? ఒక వేళ తెలంగాణ లో అస్థిర పరిస్థితి నెల కొంటే ఇక ఏం జరుగుతుంద న్న ప్రశ్న తెర పైకి వచ్చింది. కాంగ్రెస్ కు మెజారిటీ రాకపోతే బీఆర్ ఎస్ పార్టీకి బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఉందన్న చర్చలు తెరపైకి వచ్చాయి. మరి, వీటన్నింటినీ దాటి కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వస్తుందో చూడాలి.

click me!