Kalvakuntla chandrashekar... రాజ్‌భవన్ కు కేసీఆర్: రాజీనామా చేయనున్న బీఆర్ఎస్ చీఫ్

By narsimha lodeFirst Published Dec 3, 2023, 4:46 PM IST
Highlights

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.  తన రాజీనామా పత్రాన్ని  గవర్నర్ కు సమర్పించనున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో  రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా సమర్పించనున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీని ఇచ్చారు.  దీంతో  రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామాను సమర్పించనున్నారు  కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రంలో  మూడో దఫా అధికారాన్ని  దక్కించుకోవాలని భారత రాష్ట్ర సమితి భావించింది. అయితే  ఈ ఎన్నికల్లో ప్రజలు  బీఆర్ఎస్ కు షాకిచ్చారు. బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. దీంతో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామాను సమర్పించనున్నారు. 

Latest Videos

తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ కూటమికి  ఓటర్లు పట్టం కట్టారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో పాటు  పదేళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పాలనపై కొన్ని వర్గాల్లోని వ్యతిరేకత కూడ  కాంగ్రెస్ అధికారానికి కారణమైంది.  ఇవాళ సాయంత్రం  రాజ్ భవన్ కు వెళ్లి  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు  సమర్పించనున్నారు.

వాస్తవానికి ఈ నెల  4వ తేదీన  తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా రెండు రోజుల క్రితం సీఎంఓ ప్రకటించింది.  ఈ కేబినెట్ సమావేశంపై  కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ విషయమై  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి  వికాస్ రాజ్ కు  కూడ ఫిర్యాదు చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  సీఎం పదవికి రాజీనామా సమర్పించనున్నారు.ఇవాళ సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లి  రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది.


 

click me!