CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజూ మూడు, నాలుగు బహిరంగ సభలతో పాల్గొంటున్న గులాబీ బాస్. ఏం చెప్పాలనుకున్నారో.. సూటిగా సింపుల్‌గా చెబుతూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని , కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తనదైన శైలిలో మండిపడ్డారు.
CM KCR: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణాలో రాజకీయం వేడ్కేకుతోంది. మరోసారి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో సాగుతున్న అధికార బీఆర్ఎస్, ఎలాగైనా సీఎం కేసీఆర్ ను గద్దేదించ అధికారంలోకి రావాలని వ్యూహా రచన చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా.. ఏ చిన్న తప్పు దొర్లినా .. ఆ అంశాన్ని ప్రచార ఆస్త్రంగా మార్చుకుంటున్నారు. ఇలా నేతల మాటల తూటాలతొ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ తరుణంలో మరోసారి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డిని , కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తనదైన శైలిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు సీఎం కేసీఆర్ చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..సమాజంలో రైతు బాగుంటే, అతనే అందరినీ ఆదుకుంటాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా రూ.2000 పెన్షన్ ఇవ్వడం లేదనీ, ఒక వేళ ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలా పెన్షన్ ఇస్తే.. తాను ముక్కు నేలకు రాస్తానని సీఎం కేసీఆర్ అన్నారు.
undefined
బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం రూ.2000ల పెన్షన్ ఇస్తుందనీ, తాము గెలిసి మళ్ళీ గెలిస్తే ఆ మొత్తాన్ని రూ.5000లకు తీసుకెళ్తామని అన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్దాలైన ఆడుతుందనీ, అమలు చేయడానికి వీలుకానీ హామీ ఇస్తుందని మండిపడ్డారు. తాము అమలు చేయడానికి అనుకూలంగా హామీలనే ఇస్తామని అన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, పాలసీల కారణంగా మన రైతులు అప్పుల బారిన పడకుండా ఉన్నారని తెలిపారు. ఇంకో పదేళ్ళు ఇలానే ఉంటే.. తెలంగాణ రైతులు సంపన్నులవుతారని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ తరుణంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే.. నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్రబాబుకు చెంచాగిరి చేసినోడు ఇప్పుడు మాట్లాడతారా?'' అని మండిపడ్డారు. ఇవాళ కేసీఆర్‌ను తిడుతున్నాడు.. ఇది మర్యాదానా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మన దగ్గర ఎన్నికలు వస్తే.. అభ్యర్థుల నేరాలు, ఘోరాల బయటపడుతాయనీ, కానీ, ఎన్నికల్లో గెలిస్తే.. తాము ఏం చేస్తామో.. తాము ఎలాంటి హామీలను నేరవేరుస్తామో? చెప్పడం లేదనీ, ప్రజలే ఆచీతూచీ నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో నిలుచున్న అభ్యర్థితో పాటు అతని పార్టీ చరిత్రను కూడా పరిశీలించాలని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వచ్చిందే ప్రత్యేక తెలంగాణా సాధన కోసమని,ఈ ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతకు ముందు జనగామలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. జనగామకు ఒక్కడు వచ్చి ఒర్రిఒర్రి పోయిండట. కుక్కలు మస్తు ఒర్రుతాయి.. వాటిని లెక్క పెడుతామా..? ఆ పిచ్చి కుక్కలను పట్టించుకుంటామా? అంటూ ప్రశ్నించారు. ఉద్యమంలో ఉద్యమకారులపైకి రేవంత్ రెడ్డి రైఫిల్ పట్టుకొని వెళ్లాడనీ, అప్పటి నుంచి రైఫిల్‌రెడ్డి అంటున్నారని, అలాంటి వాళ్లు ఇవ్వాళ వచ్చి మాట్లాడాలంటే కనీసం సిగ్గుండాలని కేసీఆర్ మండిపడ్డారు.