Rythu Bandhu :బీఆర్ఎస్ ప్రభుత్వానికి అమలు చేస్తున్న రైతుబంధు పథకం కింద నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఎన్నికలకు ముందు ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం బిగ్ బూస్ట్ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Rythu Bandhu :కేసీఆర్ సర్కార్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఓ శుభవార్త చెప్పింది. రైతుబంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతుబంధు నిధులను లబ్ధిదారులకు నగదు బదిలీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గానీ, పోలింగ్ జరిగే రోజున గానీ లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయడం వల్ల ఎలాంటి ప్రభావాన్ని చూపబోదని చెప్పింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ వివరణ ప్రకారం నవంబరు 24 నుంచి ఎప్పుడైనా నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభించవచ్చని, పోలింగ్ రోజున కూడా డిపాజిట్ చేసుకోవచ్చని క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
undefined
వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఫలితాల విడుదల వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అమలులో ఉండవు. అందులో భాగంగానే తొలుత రైతుబంధును నిలిపివేశారు. బీఆర్ఎస్ అభ్యర్థన మేరకు పునపరిశీలన చేసిన ఈసీ ఈ పథకం అమలుకు అనుమతి లభించింది. సుమారు 7వేల కోట్ల రూపాయల నిధులను దశల వారీగా రైతుబంధులో వేయనున్నారు.
ఎన్నికల ప్రచారపర్వం ఈ నెల 28 వరకు కొనసాగుతుండగా.. ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరగనుంది. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్, బీజేపీలు దీన్ని నిలిపివేయాలని ఈసీకి విజ్ణప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉంది. ఇక బీజేపీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.