సీఎం కేసీఆర్ ఈ రోజు గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు ఫైల్ చేశారు. ఇందులో కేసీఆర్ ఆసక్తికర వివరాలు వెల్లడించారు. సీఎం కేసీఆర్ తనకు ఒక్క కారు కూడా లేదని వివరించారు. రూ. 17 కోట్ల అప్పు ఉన్నదని తెలిపారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ పత్రాల్లోని ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ పై మొత్తంగా 9 కేసులు ఉన్నట్టు ఆ పత్రాలు తెలిపాయి. కారు గుర్తుకు ఓటు వేయాలని, కారే గెలుస్తుందని ధీమాగా చెప్పిన సీఎం కేసీఆర్‌కు సొంతంగా తన పేరిట కారు లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఈ అఫిడవిట్‌లో తనకు సొంతంగా కారు లేదని, బైక్ లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. తన పేరు మీద రూ. 17.27 కోట్ల అప్పు ఉన్నదని వివరించారు. కుటుంబం పేరు మీద రూ. 7.23 కోట్ల అప్పు ఉన్నదని తెలిపారు. అలాగే.. తన పేరు మీద, తన సతీమణి శోభ పేరు మీద వివిధ బ్యాంకుల్లో రూ. 17 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని వివరించారు. రూ. 17 లక్షల విలువ చేసే 2.8 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్టు ఆ పత్రాల్లో వెల్లడించారు.
undefined
సీఎం కేసీఆర్ తన పేరు మీద ఒక్క సెంటు భూమి కూడా లేదని తెలిపారు. తన భార్య పేరు మీదా భూమిని చూపించలేదు. అయితే.. కుటుంబ ఆస్తిగా 62 ఎకరాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అందులో 9 ఎకరాల వ్యవసాయేతర భూమిగా ఉన్నట్టు తెలిపారు.
Also Read: ప్రధాని మోడీ, రాహుల్ గాంధీపై కామారెడ్డిలో సీఎం కేసీఆర్ విసుర్లు
సీఎం కేసీఆర్ తనకు సొంతంగా కారు లేదని పేర్కొనడం గమనార్హం. కారు గుర్తుకు ఓటేయాలని చెబుతున్న గులాబీ దళ నాయకుడు కేసీఆర్‌కు సొంతంగా కారు లేదని చెప్పడం ఆసక్తికరంగా మారింది.