KTR: బీఆర్ఎస్‌లో నేతల మధ్య తీవ్ర ఘర్షణ.. కేటీఆర్ రోడ్‌ షోలోనే రక్తాలు కారేలా..

By Mahesh K  |  First Published Nov 25, 2023, 10:52 PM IST

బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు భగ్గుమన్నాయి. గోషామహల్‌లో కేటీఆర్ పాల్గొన్న రోడ్ షోలోనే దిలీప్ ఘనాటే, రామచందర్ రాజుల మధ్య గొడవ జరిగింది. మాజీ కార్పొరేటర రామచందర్ దాడికి దిలీప్ ఘనాటేకు తీవ్ర రక్తస్రావమైంది.
 


హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎంతలా కొట్టుకున్నారంటే రక్తాలు కారేలా దాడి చేసుకున్నారు. ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షో లోనే చోటుచేసుకోవడం గమనార్హం.

గోషామహల్‌లో బీఆర్ఎస్ ఓ రోడ్ షఓ నిర్వహించింది. ఈ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ ఆ షోలో ప్రసంగిస్తుండగానే ఘర్షణ ప్రారంభమైంది. ఈ ఘర్షణ ప్రధానంగా ఉద్యమకారుడు దిలీప్ ఘనాటే, మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజుల మధ్య జరిగింది.

Latest Videos

undefined

Also Read:  Dog: కుక్క విశ్వాసం.. అడ్డు రావడంతో యాక్సిడెంట్.. మృతుడి తల్లి చేతిలో తల వాల్చి ఆ కుక్క విచారం

పార్టీ సమావేశాలకు సమాచారం ఇవ్వడం లేదని దిలీప్ ఘనాటే ప్రశ్నించారు. దీనికి రామచందర్ నొచ్చుకున్నారు. తననే ప్రశ్నిస్తాడా? అని ఆగ్రహించాడు. దిలీప్ ఘనాటేపై మాజీ కార్పొరేటర్ రామచందర్ భౌతిక దాడికి దిగాడు. దిలీప్ ఘనాటేకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న ఇతర కార్యకర్తలు దిలీప్ ఘనాటేను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

click me!