CM Revanth Reddy : రేవంత్ గట్టోడే... అంతటి సీనియర్ తో సాధ్యంకానిది సాధించి చూపించాడు...

By Arun Kumar PFirst Published Dec 6, 2023, 10:48 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియారిటీ వుంటేగాని పదవులు దక్కవు... కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇలా పార్టీలో  చేరాడో లేదో టిపిసిసి పదవి పొందాడు... ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పదవినే అధిరోహిస్తున్నాడు.

హైదరాబాద్ : ప్రతి రాజకీయ నాయకుడికి ఉన్నత పదవిని పొందాలన్న కోరిక వుంటుంది. ఎమ్మెల్యేకు మంత్రి కావాలని... మంత్రికి ముఖ్యమంత్రి కావాలని కోరిక వుంటుంది. రాష్ట్రాన్ని నడిపిస్తూ... ప్రజలను పాలించే ముఖ్యమంత్రి పదవిని ఒక్కసారయినా పొందాలని ప్రతి రాజకీయ నాయకుడు ఆశిస్తాడు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు... కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లకు సీఎం కల నెరవేరవేరకుండానే రాజకీయాల నుండి తప్పుకున్నారు.  కానీ కాంగ్రెస్ లో చేరిన  కొన్నాళ్లకే టిపిసిసి పదవి... ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పదవినే పొందాడు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో సీఎం కావాలని ప్రయత్నించి భంగపడ్డ నాయకులెవరో తెలుసుకుందాం.  

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించారు నిజామాబాద్ కు చెందిన ధర్మపురి శ్రీనివాస్. ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది... కానీ అప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్ లీడర్ గా వున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా వుండగా వైఎస్ ప్రమాదవశాత్తు మరణించడంతో నెక్ట్స్ సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ సమయంలో పిసిసి అధ్యక్షుడిగా వున్న డిఎస్ పేరు వినిపించింది. కానీ అనూహ్యంగా ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్యను సీఎం చేసింది కాంగ్రెస్ అదిష్టానం. 

ఇక ఆ తర్వాత కూడా డిఎస్ పేరు ముఖ్యమంత్రి రేసులో వినిపించింది. కానీ 2009 ఎన్నికల్లో నిజామాబాద్ లో పోటీచేసిన బిజెపి అభ్యర్థి యెండెల లక్ష్మనారాయణ చేతిలో డి శ్రీనివాస్ ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన  ఉపఎన్నికలోనూ డీఎస్ ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అతడి చరిష్మా తగ్గింది. అందువల్లే రోశయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి దక్కింది. ఇలా డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి కల కలగానే మిగిలిపోయింది.  

Also Read  అన్నాకేటీఆర్ చూసావా... చీప్ లీడర్ అన్నోడే చీఫ్ మినిస్టర్ అయ్యాడు..: బండ్ల గణేష్ రియాక్ట్

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనరసింహను సీఎం పదవి కోసం ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు పలించలేదు. కాంగ్రెస్ అదిష్టానం సీనియారిటీ, విదేయతకు ప్రాధాన్యత ఇచ్చి రోశయ్యను ముఖ్యమంత్రిని చేసారు. 

ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత పిసిసి చీఫ్ గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశించారు. కానీ ఆయన హయాంలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ చేతిలో ఓడిపోవడంతో సీఎం ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పుడు రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ గెలవగా సీనియారిటీ, విధేయత కలిగిన తనను ముఖ్యమంత్రి చేయాలని ఉత్తమ్ కోరారు. కానీ కాంగ్రెస్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ అదిష్టానం మొగ్గుచూపింది. 

సిఎల్పి నేత భట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. ఏఐసిసి పరిశీలకుడు డికె శివకుమార్ తో పాటు డిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించారు. కానీ అప్పటికే రేవంత్ ను సీఎం చేయాలని అదిష్టానం నిర్ణయించడంతో నిరాశ తప్పలేదు. 

click me!