వలసలు: రాహుల్‌గాంధీ జహీరాబాద్ సభ వెలవెల

By narsimha lodeFirst Published Apr 1, 2019, 1:38 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపం కారణంగా సోమవారం నాడు జహీరాబాద్‌లో నిర్వహించిన సభలో జనం పలుచగా హాజరయ్యారు.
 


జహీరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపం కారణంగా సోమవారం నాడు జహీరాబాద్‌లో నిర్వహించిన సభలో జనం పలుచగా హాజరయ్యారు.

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి  టీఆర్ఎస్‌లో వారం రోజుల క్రితమే చేరారు.కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ, టీఆర్ఎస్‌లలో చేరుతున్నారు. ఇదే సమయంలో జహీరాబాద్‌లో రాహుల్ సభను సోమవారం నాడు నిర్వహించారు. 

అయితే ఈ సభకు జన సమీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరిగా పట్టించుకోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. జిల్లాకు చెందిన నాయకత్వం కూడ ఈ విషయమై కూడ అంతగా పట్టించుకోలేదనే  విమర్శలు కూడ వ్యక్తమౌతున్నాయి.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన ఆ  నియోజకవర్గంలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. మెదక్ జిల్లాకు చెందిన నేతల మధ్య సమన్వయం లేకపోవడం కూడ ప్రధానంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు ఆ పార్టీ నేతల్లో నిరుత్సాహన్ని నింపింది. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొందరు నేతలు ఇతర పార్టీల వైపు వెళ్తున్నారు. 

జహీరాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న మదన్ మోహన్ రావుతో పాటు కొందరు నేతలు మాత్రమే ఆసక్తి చూపారు. జన సమీకరణ విషయంలో నేతల మధ్య సమన్వయం లేనట్టుగా కన్పిస్తోంది.

సంబంధిత వార్తలు

కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలో: రాహుల్ గాంధీ

 


 

click me!