డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలతో భారీ ర్యాలీ... అట్టహాసంగా సాయికిరణ్ నామినేషన్ కార్యక్రమం

By Arun Kumar PFirst Published Mar 25, 2019, 3:52 PM IST
Highlights

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయులు, టీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. సోమవారం ఆయన మారేడుపల్లిలోని ఇంటినుండి ఆబిడ్స్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. ఈ ర్యాలీలో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నాయకులతో పాటు ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు. 
 
ఇవాళ ఉదయం తొమ్మిదిగంటల నుండే  వెస్ట్ మారేడ్ పల్లి లోని తలసాని ఇంటివద్ద కోలాహలం మొదలయ్యింది. నామినేషన్ వేయడానికి బయలుదేరుతూ సాయికిరణ్ నాన్నమ్మ లలితా భాయ్, తల్లిదండ్రులు శ్రీనివాస్ యాదవ్, సువర్ణలతో పాటు కుటుంబ పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

అనంతరం ఆయన నేరుగా తమ కుటుంబం అత్యంత భక్తిశ్రద్దలతో పూజించే ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు అతడికి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించిన సాయికిరణ్ ముందుకు కదిలారు.

అక్కడి నుండి అసెంబ్లీ ఎదురుగా గల గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను  గుర్తుచేసుకుని నివాళులు అర్పించారు.

అక్కడి నుండి ప్రత్యేక వాహనంపై భారీ ర్యాలీతో  సాయికిరణ్ ఆబిడ్స్ కు బయలుదేరారు. తండ్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోమ్ మంత్రి మహమూద్ అలీ, మంత్రి ఎంబిసి చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎంఐంఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంఎల్సీ లు ఎగ్గే మల్లేశం, ప్రభాకర్, సలీం, హజ్ కమిటీ చైర్మన్ మసి ఉల్లా ఖాన్, నాంపల్లి టీఆర్ఎస్ ఇంచార్జి ఆనంద్ గౌడ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇలా ఆబిడ్స్ లోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సాయికిరణ్ యాదవ్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు.   
  
click me!