టీఆర్ఎస్‌లోనే ఉంటా: స్పష్టం చేసిన పొంగులేటి

By narsimha lodeFirst Published Mar 25, 2019, 12:59 PM IST
Highlights

తాను టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టిక్కెట్టు దక్కని కారణంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగింది.

ఖమ్మం: తాను టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టిక్కెట్టు దక్కని కారణంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. ఈ ఆరోపణలకు పొంగులేటి చెక్ పెట్టారు.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేతల గ్రూపు తగాదాల కారణంగానే ఖమ్మం జిల్లాలో ప్రజా కూటమి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొందని కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు.

ఈ పరిణామాలను పురస్కరించుకొని టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్‌ఎస్ ‌లో చేరిన నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు. దరిమిలా ఆదివారం నాడు పొంగులేటి కార్యాలయం వద్ద ఆయన అనుచరులు, అభిమానులు పోటీ చేయాలని ఆందోళన కొనసాగించారు.  ఈ ఆందోళనల సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడ భావోద్వేగానికి గురయ్యారు.

తాను పార్టీలోనే కొనసాగుతానని పొంగులేటి స్పష్టం చేశారు.ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.  మరోవైపు ఖమ్మం ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు పొంగులేటిని కోరితే ఆయన ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

click me!