పొతంగల్ లో మొరాయించిన ఈవీఎంలు... కవిత అసహనం

By Arun Kumar PFirst Published Apr 11, 2019, 10:20 AM IST
Highlights

టీఆర్ఎస్ మహిళా నేత, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఓటు హక్కును వినియోచుకున్నారు.బోధన్ సమీపంలోని స్వగ్రామమైన పోతంగల్‌లోని పోలింగ్ బూత్‌‌లో భర్తతో కలిసి ఆమె ఓటు వేశారు.

టీఆర్ఎస్ మహిళా నేత, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఓటు హక్కును వినియోచుకున్నారు.బోధన్ సమీపంలోని స్వగ్రామమైన పోతంగల్‌లోని పోలింగ్ బూత్‌‌లో భర్తతో కలిసి ఆమె ఓటు వేశారు.

భర్తతో కలిసి ఉదయమే పోలింగ్ బూత్ కు వెళ్ళిన ఆమె అందరితో పాటే క్యూలో నిల్చున్నారు. అయితే ఇదే సమయంలో ఈవీఎంలో సమస్య తలెత్తి పోలింగ్ ప్రక్రియ  దాదాపు 40 నిమిషాలు ఆలస్యమయ్యింది. దీంతో అప్పటివరకు కవిత దంపతులు క్యూలైన్ లోనే వేచిచూడాల్సి వచ్చింది. 

దీనిపై కవిత స్పందిస్తూ ఎన్నికల అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఈవీఎం లను సరిచూసుకుంటే బావుండేదని...అలా చేయకపోవడం వల్లే ఈవీఎంలు మొరాయించివుంటాయన్నారు.  ఓటర్లను ఇబ్బంది పెట్టకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను సూచించారు. 

click me!