ఎపిలో వైఎస్ జగన్ దే విజయం, కలిసి పనిచేస్తాం: కేటీఆర్

By telugu teamFirst Published Mar 30, 2019, 2:33 PM IST
Highlights

ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా తాము పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డిలతో కలిసి పనిచేస్తామని కేటీఆర్ చెప్పారు.

నర్సంపేట: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జోస్యం చెప్పారు. తాము జగన్ తో కలిసి పనిచేస్తామని అన్నారు. నర్సంపేటలో ఆయన శనివారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. 

ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా తాము పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డిలతో కలిసి పనిచేస్తామని కేటీఆర్ చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ లోకి ఎపి నుంచి జగన్ వస్తానరని ఆయన అన్నారు.

మంచి రోజులు రావాలంటే మోడీ ఓడించి తీరాలని అన్నారు. కాంగ్రెసు, బిజెపిల విజయం వల్ల ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు.  నర్సంపేటలో బహిరంగ సభ ముగిసిన తర్వాత ఆయన ములుగు బహిరంగ సభలో పాల్గొంటారు.

click me!